విశ్వనాథ్ – వెలుగు నీడలు(ఆఖరి భాగం)

KViswanadh picచిత్ర సీమలో విశ్వనాథ్ సుదీర్ఘ పయనం:

ఒక రచయిత దర్శకుడు ఒక సినిమా కధ తయారు చేసుకునేటప్పుడు ముఖ్యంగా  బాక్స్ ఆఫీసు విజయాన్ని అందించే  అంశాలని,  చిత్ర విజయానికి ప్రస్థుత పరిస్థితుల్లో అవసరమైన కధాంశాలను దృష్టిలో పెట్టుకుంటాడు.  ఈ చిత్రం విజయం సాధిస్తే మరుసటి చిత్రం తను అనుకున్న విధంగా తనకు సంతృప్తి కలిగించే విధంగా తీయవచ్చు అని కూడా అనుకుంటాడు. ప్రేక్షకుల అభిరుచి ఇల్లాగే ఉంది అనుకుని తన అభిరుచిని, విలువలని పక్కన పెట్టి సినిమా తీసే దర్శకుడు  ప్రేక్షకుడి మంచి సినిమాలను ఆదరించే  అభిరుచిని, తెలివి తేటల్ని,  తక్కువ అంచనా వేస్తున్నాడు.  ఈ ప్రక్రియలో దర్శకుడు తను నమ్మిన విలువలను, సిద్ధాంతాలను, చంపుకొని  తన స్వభావానికి విరుద్ధంగా సినిమా  బాక్స్ ఆఫీస్ సూత్రాల కనుగుణంగా   తీయడానికి పూనుకుంటాడు. చదవడం కొనసాగించండి

ప్రకటనలు

విశ్వనాథ్ – వెలుగు నీడలు(ఎనిమిదవ భాగం)

kalatapasvi-kalarupalu

విశ్వనాథ్ – సంగీతం

కొన్ని సంబంధాలు కలుపుకోవడం కష్టం అయితే  కొన్నిసంబంధాలు పెంచుకోవడం కష్టం. కొన్ని సంబంధాలలో ఒడిదుడుకులు ఉంటే  కొన్ని   నిలుపుకోవడం కష్టం, ముఖ్యంగా సృజనాత్మకత అవసరమైన చోట. కొన్ని సందర్భాలలో ఎదుటి వారి ప్రతిభకు తన ప్రావీణ్యం అడ్డు రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఒక దర్శకుడు రచయిత తో కానీ మరే కళాకారుడితో కానీ చర్చించేటప్పుడు,  ఒక సన్నివేశం గురించి తన భావాలు,  ఉద్దేశ్యం, వివరించి చెపితే చాలు. కళాకారుడు దర్శకుడి భావాల కనుగుణంగా సన్నివేశం రక్తి కట్టడానికి తన తెలివి తేటలు ఉపయోగిస్తాడు. ఇది కళాకారుడి పై, అతని సృజనాత్మక పై  దర్శకుడికి ఉన్న నమ్మకానికి నిదర్శనం.  చదవడం కొనసాగించండి

విశ్వనాథ్ – వెలుగు నీడలు(ఏడవ భాగం)

sirivennela-seetha-rama-sastri-mp3-hits

 

సున్ని పిండిని నలిచి,చిన్నారిగా మలిచి
సంతసాన మురిసింది సంతులేని పార్వతి
సుతుడన్న మాట మరిచి శూలాన తెగ నరికి
పెద్దరికం నిలుపుకొనె నిప్పుకంటి పెనిమిటి

గంగాధరం  యొక్క  ప్రతిభ మీద అనంతరామ శర్మకి కలిగిన  అసూయ, తద్వారా ఇంటిలో అన్యోన్యత, శాంతి ఏ విధంగా గతి తప్పేయో చెప్పడానికి  పురాణ పాత్రలు శివుడు, పార్వతి , వినాయకుల ఉదాహరణ తో,  భర్త యందు విధేయత, పిల్లల మీద ప్రేమ మధ్య అనాదిగా నలిగిపోతున్న స్త్రీ  మనసులో సంఘర్షణ తో పోల్చారు సీతారామ శాస్త్రి. కధను పూర్తిగా అవగాహన చేసుకొని కదానుగుణం గా ఆ సన్నివేశంలో సందర్భాను సారంగా పోలికలు తెస్తూ సాహిత్యంలో సందేశాన్ని మిళితం చేస్తూ వ్రాస్తారు సిరివెన్నెల ముఖ్యంగా విశ్వనాథ్ సినిమాలకి. చదవడం కొనసాగించండి

విశ్వనాథ్ – వెలుగు నీడలు (ఆరవ భాగం)

KViswanadh pic

 

వాగర్దావివ సంపృక్తౌ వాగర్దప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ

కాళిదాసు రచించిన శ్లోకానికి,  విడదీయలేని సంబంధం గల  ‘వాక్కు, అర్ధం’  లాగా విడదీయలేని బంధం గల ఆదిదంపతులకు ప్రణామం  అని   అర్ధం చెప్పుకోవచ్చు.  ఆ శ్లోకంలో  ఒక పదాన్ని విడగొట్టి  పార్వతీప  (పార్వతి భర్త) రమేశ్వరం (లక్ష్మి దేవి భర్త )  అని కొద్దిగా మార్చిన ఖ్యాతి  ప్రఖ్యాత కవి, పండితుడు వేటూరి ప్రభాకర శాస్త్రి (వేటూరి సుందరరామ మూర్తి  తండ్రి గారు) కి దక్కుతుంది. దీనికీ, విశ్వనాథ్ చిత్రసీమలో తన సుదీర్ఘ ప్రయాణంలో చేసిన సాహిత్య ప్రయోగాలకి సాపత్యం ఉంది. చదవడం కొనసాగించండి

విశ్వనాథ్ – వెలుగు నీడలు (ఐదవ భాగం)

విశ్వనాథ్ – పద శిల్పి

writing3

పదాలు భావోద్వేగాలని పలికిస్తాయా లేక భావోద్వేగాల వలన పదాలు అర్ధవంతమవుతాయా? విశ్వనాథ్ ఎంత క్లుప్తంగా భావ ప్రకటన చేస్తారో, అంతే ఖచ్చితత్వంగా పదాలు పలికిస్తారు. ఆదుర్తి, ముళ్ళపూడి, దుక్కిపాటి, గొల్లపూడి వంటి వారితో కలిసి పనిచేయడం వల్ల విశ్వనాథ్  సరైన పదం  సందర్భానుసారంగా , సరైన సమయంలో పలికించడంలో ప్రావీణ్యం సంపాదించారు.  అతని సినిమాలలో భావోద్వేగ భరితమైన ఏ సన్నివేశంలో నైనా మోతాదు మించని సంభాషణలు అర్ధవంతంగా ఉంటాయి. చదవడం కొనసాగించండి

విశ్వనాథ్ – వెలుగు నీడలు (నాలుగవ భాగం)

SK2

(స్వర్ణ కమలం – విశ్వనాథ్ కవిత)

కళ వల్ల ఏమి ప్రయోజనం ఉంది? కళ ఏమి సాధించాలి? మనో వికాసమా, మేలుకోలుపా,  వినోదమా, ప్రబోధమా, బహుశా ఇవి కొన్ని సమాధానాలు. ఇవన్నీ నెరవేరిన తరువాత కూడా,  ఇంకొక అడుగు ముందుకు వేయించి బ్రహ్మానందాన్ని,  తన్మయత్వాన్ని కలిగించే శక్తి కళకు ఉంది. ఈ స్థితి లో కళాకారుడు, కళ మధ్య దూరం తరిగిపోతుంది. కళ కళాకారుడిని ఉత్తేజపరుస్తోందా, లేక కళాకారుడు కళని ఉచ్ఛ స్థితికి తీసుకెళ్ళు తున్నాడా అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. మహోన్నత స్థితి కి చేరినప్పుడు మాటలుండవు. ఆ అనుభూతిని వర్ణించలేము. ఆ అనుభూతిని చెందిన వారు  ఇతరులకు,  కళ వల్ల ఇది సాధ్యమని చెప్పి ఒప్పించలేక పోవచ్చు.  ఆ రస సిద్ధి కోసం చేసే ప్రయత్నం, బ్రహానందాన్ని అనుభవించాలనే తపన, అందుకోసం తనని తాను శోధించుకోవడం  మొదలైనవన్నీ నెరవేరాలంటే నమ్మకం ఉండాలి. నమ్మకమే లేకపోతే  ఆ సాధన నిరర్ధకం, ఆ ప్రయత్నం వ్యర్ధం. చదవడం కొనసాగించండి

విశ్వనాథ్ – వెలుగు నీడలు (మూడవ భాగం)

సిరివెన్నెల – విశ్వనాథ్ కి ఒక పరీక్ష

movieposter

తన చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని ఒక అంధుడు ఎలా వర్ణించగలడు? పక్షుల కిలకిలారావాలని కానీ సంగీత మాధుర్యాన్ని కానీ ఒక మూగవాడు ఎలా పలికించగలడు? ముఖ్యంగా ఒక సినిమాలో.  సినిమా అనేది ముఖ్యంగా దృశ్య, శబ్ద సంబంధమైనది. ఈ సమస్యను ఒక సవాలుగా తీసుకొని దర్శకుడు సౌందర్య స్వభావాన్ని, దాని ప్రభావాన్ని ఒక అంధ, మరొక మూగ పాత్రలద్వారా పలికించడానికి ప్రయత్నించాడు. ఈ సాహసోపేతమైన ప్రయత్నంలో దర్శకుడు తనపాత్రలు అనుభవించిన భావాలని పలికించడంలో కృతకృత్యుడయాడు.  శారీరిక లోపాలున్న పాత్రలు అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగే అందాలకి కొత్త అర్ధం చెప్పటానికి ‘సిరిసిరి మువ్వ’ తో  మొదలు పెట్టిన ప్రయత్నాన్ని ‘సిరివెన్నెల’ తో విశ్వనాధ్ కొనసాగించారు. సినిమా పేరు కవితాత్మకం గా పెట్టేరు. సిరివెన్నెల అంటే పూర్తిగా వికసించిన వెన్నెల, ఆహ్లాదపరిచే నిశ్శబ్దత,   సౌందర్యం,  సొగసు, లావణ్యం లకు ప్రతీక. ఒకరు అందాన్ని చూడలేరు, మరొకరు చూసిన దానిని చెప్పలేరు, చూస్తున్న ప్రేక్షకుడు గ్రహించగలుగుతాడు వారిరువురూ వారి పరిధులలో దాన్ని ఆస్వాదించ గలరు అని. ఒక కవి అన్నట్టు, మేధను ఉపయోగించి ప్రకృతిని వర్ణించాలంటే గణితమే ఏకైక మార్గం అయితే, అనుభవపూర్వకంగా గ్రహించిన ప్రకృతి అందాలని వర్ణించడానికి ఒకే ఒక మార్గం కళ.  విశ్వనాథ్ కళ నే ఎంచుకున్నారు.  అంధుడైనా సినిమా నాయకుడు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అనుభవపూర్వకం గా తెలుసుకోగలడు. మూగ నాయకి తన కళ (చిత్రాల) ద్వారా సంభాషించ గలదు.   చదవడం కొనసాగించండి